Vikas dubey encounter: వికాస్ దూబే మరణంతో అతని గ్రామంలో పండగొచ్చింది!

Vikas dubey encounter: వికాస్ దూబే మరణంతో అతని గ్రామంలో పండగొచ్చింది!
x
Vikas dubey encounter the villagers of Vikas dubey native make festival on his death
Highlights

Vikas dubey encounter: బతికున్నప్పుడు కన్నా చనిపోయినప్పుడు నలుగురు చెప్పుకోవాలంటారు పెద్దలు.... దానికి వికాస్ దూబే వ్యవహారం విరుద్ధం... తన వల్ల ఇంతవరకు తన గ్రామంలో మిగిలిన వారంతా స్వేచ్ఛ లేకుండా బ్రతికామని, వాడు చనిపోతే తమకు ఇష్టం వచ్చినట్టు బతకవచ్చని ఆనందిస్తున్నారు.

Vikas dubey encounter: బతికున్నప్పుడు కన్నా చనిపోయినప్పుడు నలుగురు చెప్పుకోవాలంటారు పెద్దలు.... దానికి వికాస్ దూబే వ్యవహారం విరుద్ధం... తన వల్ల ఇంతవరకు తన గ్రామంలో మిగిలిన వారంతా స్వేచ్ఛ లేకుండా బ్రతికామని, వాడు చనిపోతే తమకు ఇష్టం వచ్చినట్టు బతకవచ్చని ఆనందిస్తున్నారు. పండగ చేసుకుంటున్నారు. ప్రభుత్వాలనే ముప్పుతిప్పలు పెట్టి, చివరకు ఎన్ కౌంటర్లో చనిపోయిన కరుడు గట్టిన ఉగ్రవాదిలా మారిన ఆయన మరణాన్ని వారు సంతోషంగా జరుపుకోవడం అంటే వికాస్ దూబే బతికున్నప్పుడు వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టి ఉంటాడనే దానిపై ఆలోచించాల్సిన విషయమే.

రౌడీ షీట‌ర్ వికాస్ దుబే ఎన్‌కౌంట‌ర్‌లో హ‌తం కావ‌డంతో కాన్పూర్ వాసులు సంబ‌రాల్లో మునిగితేలుతున్నారు. ముఖ్యంగా వికాస్ దుబే స్వ‌గ్రామ‌మైన బికారు గ్రామవాసుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఊరు ఊరంతా స్వీట్లు పంచిపెట్టుకుంటున్నారు.

ఎన్‌కౌంట‌ర్‌ లో వికాస్ దుబే హ‌తం కావ‌డం త‌మకెంతో సంతోషంగా ఉంద‌ని.. ఇక‌పై తాము స్వేచ్ఛ‌గా జీవిస్తామంటూ గ్రామ‌స్తులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక త‌మ ఊరిలో కొత్త అధ్యాయం మొద‌లైన‌ట్టేనంటూ సంతోష‌ప‌డుతున్నారు.

మ‌రోవైపు దుబే ఎన్‌కౌంట‌ర్‌పై విప‌క్షాలు మండిపడుతున్నాయి. తాము చేసిన త‌ప్పుల నుంచి త‌ప్పించుకునేందుకే ఎన్‌కౌంట‌ర్ పేరుతో ప్ర‌భుత్వం నాట‌కం ఆడుతోంద‌ని విమ‌ర్శిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ ఎన్‌కౌంట‌ర్‌పై సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories