Vikas dube killed: వికాస్ దూబే ఎన్ కౌంటర్..పారిపోతుండగా కాల్పులు జరిపిన పోలీసులు

Vikas dube killed: వికాస్ దూబే ఎన్ కౌంటర్..పారిపోతుండగా కాల్పులు జరిపిన పోలీసులు
x
Vikas dube killed
Highlights

Vikas dube killed: కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. వందలాది నేరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ఆయన్ను వేటాడేందుకు యూపీ ప్రభుత్వం పెద్ద స్కెచ్ వేసింది.

Vikas dube killed: కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. వందలాది నేరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ఆయన్ను వేటాడేందుకు యూపీ ప్రభుత్వం పెద్ద స్కెచ్ వేసింది. ఎట్టకేలకు ఆయన్ను అరెస్టు చేయగా, తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు.

కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉదయం కాల్చి చంపారు. దూబే పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించాడని సమాచారం. కరడుకట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్ నగరానికి తీసుకువస్తున్న కారు శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. భారీ వర్షం కురుస్తుండటంతోపాటు రోడ్డు సరిగా లేకపోవడం వల్ల కారు ప్రమాదానికి గురై బోల్తా పడిందని యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెప్పారు. కారు ప్రమాదవశాత్తూ బోల్తా పడగానే గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే పరాిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. దూబే ప్రయాణిస్తున్న కారు బోల్తా పడిన ప్రదేశంలో కాల్పుల శబ్ధం వినిపించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories