Vikas Dubey Arrest: రౌడీ షీటర్ వికాస్ దూబే అరెస్ట్ పై పలు అనుమానాలు?

Vikas Dubey Arrest: రౌడీ షీటర్ వికాస్ దూబే అరెస్ట్ పై పలు అనుమానాలు?
x
Highlights

Vikas Dubey Arrest: రౌడీ షీటర్ వికాస్ దూబే అరెస్ట్ పై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ కౌంటర్ భయంతో వికాస్ దూబే లొంగిపోయాడా...

Vikas Dubey Arrest: రౌడీ షీటర్ వికాస్ దూబే అరెస్ట్ పై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ కౌంటర్ భయంతో వికాస్ దూబే లొంగిపోయాడా లేదా మధ్యప్రదేశ్ కీలక బీజేపి నేతతో మాట్లాడిన తరువాత లొంగిపోయాడా అనే విషయంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా అసలు మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేసిన ఆ కీలక మధ్యప్రదేశ్ బిజెపి నేత ఎవరు? అన్న సందేహాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. వికాస్ దూబే స్వయంగా పోలీసులకు లొంగిపోయాడా? లేదా పోలీసులు పట్టుకున్నారా ? అంటూ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. యూపీ పోలీసులకు దొరక్కుండా అతిసులువుగా మధ్యప్రదేశ్ లో ఎందుకు లొంగిపోయాడు అని కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వికాస్ దూబే కాల్ డాటా రికార్డ్ పోలీసులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు అఖిలేష్ యాదవ్. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కు, వికాస్ దూబే కు సంబంధాలున్నాయా?.. నరోత్తమ్ మిశ్రా యూపీ ఎన్నికల సమయంలో కాన్పూరు ఇంఛార్జిగా ఉన్నప్పుడు వికాస్ దూబే అతనికి సహకరించాడా అన్న విషయాలు పార్టీ వర్గాల్లో అనుమాలాలు కలుగుతున్నాయి. యూపీ పోలీసులు వికాస్ దూబే ను పట్టుకోలేకపోయారా? నిజంగా వైఫల్యమేనా?..వికాస్ దూబే కి యూపీలో ఏ రాజకీయ పార్టీ అండదండలు ఉన్నాయి అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అరెస్టయ్యాడు. 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న కిరాతక రౌడీని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు యూపీ పోలీస్ వర్గాలు తెలిపాయి. ఉజ్జయినిలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పోలీసుల పనితీరుపై తీరుపై యూపీ సీఎం యోగి ఆధిత్యనాధ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వికాస్ దూబే మధ్యప్రదేశ్ పోలీసులకు చిక్కడం పై రాష్ట్ర పోలీసుల వైఫల్యంగా భావిస్తున్న యూపీ సీఎం, అత్యవసరంగా సీఎం కార్యాలయానికి రావాల్సిందిగా సీనియర్ పోలీసు అధికారులకు యోగి ఆధిత్యనాధ్ ఆదేశించారు. వికాస్ దూబేను తామే సీసీటీవీ పుటేజ్ ద్వారా గుర్తించినట్లు ఉజ్జయిని మహాంకాళి ఆలయ అధికారులు వెల్లడించారు. తమ భద్రతా సిబ్బంది వికాస్ దూబే ను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారని ఆలయ అధికారులు తెలిపారు. తన అనుచరులు ఒక్కొక్కరు పోలీసుల ఎన్ కౌంటర్ లో మృతిచెందడంతో తనను కూడా పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారన్న భయంతో వికాస్ దూబే లొంగిపోయాడని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories