VVS Laxman: త్వరలోనే బీజేపీలో చేరనున్న వీవీఎస్ లక్ష్మణ్?

VVS Laxman: రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్న మరో క్రికెటర్?

Sandeep Eggoju
Published on: 27 Oct 2021 5:49 PM IST
Cricketer VVS Laxman Going to be Join in BJP Party
X

బీజేపీలో చేరనున్న క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ (ఫైల్ ఇమేజ్)

VVS Laxman: భారత మాజీ క్రికెటర్, స్టయిలిష్ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఇప్పటికే లక్ష్మణ్‌తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు సమాచారం. మరోవైపు తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ క్రికెట్ ఫ్యాన్స్ అంతా అభిమానించే లక్ష్మణ్ ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు లక్ష్మణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లక్ష్మణ్ బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి లక్ష్మణ్‌ను ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story