Covid vaccine Covaxin update: కొవాగ్జిన్ క్లినికల్‌ ట్రయల్స్‌లో పురోగతి

Covid vaccine Covaxin update: కొవాగ్జిన్ క్లినికల్‌ ట్రయల్స్‌లో పురోగతి
x
India's first covid vaccine Covaxin update
Highlights

Covid vaccine Covaxin update: ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్ర‌మంలో క‌రోనా వాక్సిన్ కోసం ప్ర‌పంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి.

Covid vaccine Covaxin update: ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్ర‌మంలో క‌రోనా వాక్సిన్ కోసం ప్ర‌పంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. శాస్త్ర‌వేత్త‌లు కూడా హ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో హర్యానా రాష్ట్రంలోగల పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌ (పీజీఐ)లో నిర్వ‌హించిన 'కొవాగ్జిన్‌' టీకా మొదటి దశ క్లినికల్‌ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తైనట్లు ట్రయల్‌ టీం ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ సవితావర్మ వెల్లడించారు. ఫేస్‌ -1లో రెండో భాగం కింద శనివారం మొత్తం ఆరుగురికి టీకా వేసినట్లు ఆమె చెప్పారు.

'టీకా ట్రయల్‌ ఫేస్‌ -1లో మొదటి భాగం పూర్తయిందని సవితావర్మ తెలిపారు. దేశ‌వ్యాప్తంగా 50 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చామ‌ని, ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా ఉన్నాయ‌ని అన్నారు. సెకండ్ ఫేజ్ కింద ఆరుగురికి వ్యాక్సిన్ ఇచ్చామ‌ని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు కొవాగ్జిన్ మొదటి దేశీయ టీకాగా భావిస్తున్నారు. జూలై 17న ఈ టీకా మొదటి హ్యుమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ పీజీఐ రోహతక్‌లో ప్రారంభమయ్యాయి. ఆ రోజు ముగ్గురు వాలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories