Coronavirus Updates in AP: ఏపీలో విజృంభిస్తున్న కరోనా..

Coronavirus Updates in AP: రాష్ట్రంలో గత 24 గంటల్లో 47, 645 సాంపిల్స్‌ ని పరీక్షించగా 7, 627 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

S. Srikanth
Published on: 26 July 2020 6:30 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో విజృంభిస్తున్న కరోనా..
X
Representational Image

Coronavirus Updates in AP: రాష్ట్రంలో గత 24 గంటల్లో 47, 645 సాంపిల్స్‌ ని పరీక్షించగా 7, 627 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కొత్తగా 3,041 మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌ వల్ల తూర్పు గోదావరి లో 09, విశాఖపట్నం 09, కృష్ణ జిల్లా 05, కర్నూల్ 06, శ్రీకాకుళంలో 05, పచ్చిమ గోదావరి 05, నెల్లూరు 05, చిత్తూరు 04, విజయనగరం 03, కడప 02, అనంతపురం 02, గుంటూరు లో 01 మరణించారు.

నేటి వరకు రాష్ట్రంలో 16,43,319 సాంపిల్స్‌ ని పరీక్షించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 96, 298 పాజిటివ్ కేసు లకు గాను.. 2895 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారుండగా.. 1,041 మంది మరణించారు. ప్రస్తుతం కేసులతో కలిపి రాష్ట్రంలో 48,956 యాక్టివే కేసులు ఉన్నాయ్. ఇక కరోనాతో పోరాడి రాష్ట్రంలో ఇప్పటివరకు 46, 301 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ను విదుల చేసింది.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 48,661 కేసులు నమోదు కాగా, 705 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 36,145 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 13,85,522 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,67,882 ఉండగా, 8,85,576 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 32,063 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 4,42,263 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,62,91,331 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.




S. Srikanth

S. Srikanth

Next Story