Lav Agarwal: భారత్‌లో సెకండ్‌వేవ్‌పై లవ్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు

Lav Agarwal: దేశంలో కోవిడ్ సెకండ్‌వేవ్ ఇంకా ముగియలేదన్న కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలతో మళ్లీ కరోనా కలవరం మొదలయింది.

Arun Chilukuri
Published on: 3 Aug 2021 7:47 PM IST
COVID-19 Second Wave is Still not Over in India: Lav Agarwal
X

Lav Agarwal: భారత్‌లో సెకండ్‌వేవ్‌పై లవ్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు

Lav Agarwal: దేశంలో కోవిడ్ సెకండ్‌వేవ్ ఇంకా ముగియలేదన్న కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలతో మళ్లీ కరోనా కలవరం మొదలయింది. 8 రాష్ట్రాల్లో ఆర్-వాల్యూ అధికంగా ఉన్నట్లు కూడా కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఆర్-వాల్యూపై సంచలన వ్యాఖ్యలు చేసిన లవ్ అగర్వాల్ ప్రపంచ వ్యాప్తంగా ఇంకా అధిక స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయన్నారు.

క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్పుడే అంతం అయ్యేలా లేద‌న్న అగర్వాల్.. ఇటు దేశంలోనూ ఇంకా సెకండ్ వేవ్ స‌మ‌సిపోలేద‌ని షాకిచ్చారు. దేశ‌వ్యాప్తంగా 44 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం క‌న్నా ఎక్కువ‌గా ఉన్నట్లు మంత్రి చెప్పారు. కేర‌ళ‌, మ‌ణిపూర్‌, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల్లో పాజిటివిటీ ఎక్కువ‌గా ఉన్నట్లు అగ‌ర్వాల్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story