తమిళనాడులో కొట్టగా 1,974 కేసులు.. 38 మరణాలు

S. Srikanth
Published on: 14 Jun 2020 8:56 PM IST
తమిళనాడులో కొట్టగా 1,974 కేసులు.. 38 మరణాలు
X

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,974 పాజిటివ్ కేసులు, 38 మరణాలు సంభవించాయి. దీనితో తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 44,661కి చేరింది. ఇప్పటివరకు 435 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనాతో పోరాడి రాష్ట్రంలో 24,547 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 19,676 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్నారు.

దేశంలో కరోనా కేసులు 3.2 లక్షలకు పైగా చేరుకున్నాయి. గత 24 గంటల్లో 11,929 తాజా కరోనావైరస్ అంటువ్యాధులు మరియు 311 మరణాలను కేంద్ర ఆరోగ్యశాఖ నివేదించింది. కొత్త కేసులతో భారతదేశ కరోనావైరస్ కేసుల సంఖ్య 320,922 కు చేరాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

ఇందులో 149,348 క్రియాశీల కరోనావైరస్ కేసులు ఉన్నాయి.. 162,379 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే కోవిడ్ భారిన పడి భారతదేశంలో మరణించిన వారి సంఖ్య 9,195 కి చేరుకుంది.


S. Srikanth

S. Srikanth

Next Story