తమిళనాడులో విజృంభిస్తున్న 'కరోనా' మహమ్మారి : 48000 దాటిన కరోనా కేసులు

admin1
Published on: 16 Jun 2020 9:52 PM IST
తమిళనాడులో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి : 48000 దాటిన కరోనా కేసులు
X

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా నమోదవుతున్న కేసులను చూస్తే.. మరో రెండు మూడు రోజుల్లో యాభై వేల మార్క్‌ను దాటేసేలా ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,515 పాజిటివ్ కేసులు, 49మరణాలు సంభవించాయి. దీనితో తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 48,019కి చేరింది. ఇప్పటివరకు528 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం 20,706 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్నారు.

admin1

admin1

Next Story