Coronavirus updates in odisha: ఒడిషాలో కరోనా క‌రాళ నృత్యం ..తాజాగా మరో 1,078 కేసులు..

Coronavirus updates in odisha: ఒడిషాలో కరోనా మహమ్మారి క‌రాళ నృత్యం చేస్తుంది. కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

Samba Siva Rao
Published on: 22 July 2020 4:31 PM IST
Coronavirus updates in odisha: ఒడిషాలో కరోనా క‌రాళ నృత్యం ..తాజాగా మరో 1,078 కేసులు..
X
Coronavirus updates in odisha 1,078 New cases registered in 24 hours

Coronavirus updates in odisha: ఒడిషాలో కరోనా మహమ్మారి క‌రాళ నృత్యం చేస్తుంది. కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,078 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ‌ని ఆ రాష్ట్ర‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతే కాకుండా.. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ఐదుగురు మరణించారు. మ‌ర‌ణించిన వారంతా డయాబెటిస్‌ పేషెంట్లేనని.. అందులో నలుగురు అరవై సంవత్సరాలు దాటిన వారేనని అధికారులు పేర్కొన్నారు. బాధితుల్లో నలుగురు గంజాం జిల్లాకు చెందిన వారు కాగా, ఒకరు కందమాల్ జిల్లాకు చెందిన వారని అధికారులు తెలిపారు.

కాగా, గంజాం జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి 31 వరకు లాక్‌డౌన్ విధించినట్లు స్టేట్ చీఫ్ సెక్రటరీ అసిత్ త్రిపాఠీ తెలిపారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,835కి చేరింది. వీటిలో ప్రస్తుతం 6,386 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 13,310 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

దేశ‌వ్యాప్తంగా నేటి వ‌ర‌కు మొత్తం 11,92,915 కేసులు నమోదయ్యాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 4,11,113 ఉండగా, 7,53,049 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 28,732 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,43,243 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,47,24,546 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story