మహారాష్ట్రలో కరోనా పంజా.. ఒక్క రోజే 2739 పాజిటివ్ కేసులు

S. Srikanth
Published on: 6 Jun 2020 8:13 PM IST
మహారాష్ట్రలో కరోనా పంజా.. ఒక్క రోజే 2739 పాజిటివ్ కేసులు
X
Representational Image

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 2739 పాజిటివ్ కేసులు, 129 మరణాలు సంభవించాయి. దీనితో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 82,968కి చేరింది. ఇప్పటివరకు 2969 మంది మృత్యువాతపడ్డారు.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,987 కేసులు నమోదు కాగా, 294 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,36,657 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,15,942 ఉండగా, 1,14,072 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా,6,642 మంది వ్యాధితో మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.


S. Srikanth

S. Srikanth

Next Story