కర్ణాటకలో కొత్తగా 378 కేసులు...

S. Srikanth
Updated on: 6 Jun 2020 8:36 PM IST
కర్ణాటకలో కొత్తగా 378 కేసులు...
X
Representational Image

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక కర్ణాటక కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 378 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం మీద కర్ణాటక కరోనా కేసుల సంఖ్య 5213కు పెరిగాయి. ఇప్పటివరకు కరోనాతో 59 మంది చనిపోయారు.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,987 కేసులు నమోదు కాగా, 294 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,36,657 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,15,942 ఉండగా, 1,14,072 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా,6,642 మంది వ్యాధితో మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.


S. Srikanth

S. Srikanth

Next Story