కర్ణాటకలో 7,000కు చేరిన కరోనా కేసులు..

S. Srikanth
Published on: 14 Jun 2020 9:03 PM IST
కర్ణాటకలో 7,000కు చేరిన కరోనా కేసులు..
X
Representational Image

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక కర్ణాటక కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 176 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం మీద కర్ణాటక కరోనా కేసుల సంఖ్య 7,000కు పెరిగాయి. ఇప్పటివరకు కరోనాతో 89 మంది చనిపోయారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,956 గా ఉంది. ఇప్పటివరకు 3,955 మంది కోలుకున్నారు.

దేశంలో కరోనా కేసులు 3.2 లక్షలకు పైగా చేరుకున్నాయి. గత 24 గంటల్లో 11,929 తాజా కరోనావైరస్ అంటువ్యాధులు మరియు 311 మరణాలను కేంద్ర ఆరోగ్యశాఖ నివేదించింది. కొత్త కేసులతో భారతదేశ కరోనావైరస్ కేసుల సంఖ్య 320,922 కు చేరాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

ఇందులో 149,348 క్రియాశీల కరోనావైరస్ కేసులు ఉన్నాయి.. 162,379 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే కోవిడ్ భారిన పడి భారతదేశంలో మరణించిన వారి సంఖ్య 9,195 కి చేరుకుంది.


S. Srikanth

S. Srikanth

Next Story