Coronavirus Updates in India: భారత్‌లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు

Arun Chilukuri
Updated on: 5 Sept 2020 9:38 AM IST
Coronavirus Updates in India: భారత్‌లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు
X

India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 40 లక్షల 23 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో రికార్డ్ స్థాయిలో 86,432 కేసులు నమోదు కాగా, 1089 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 70,072 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 40,23,180 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8,46,395 ఉండగా, 31,07,223 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 69,561 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.23 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.73 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 21.04 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 10,59,346 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 4,77,38,491 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story