Coronavirus Updates in India: భారత్‌లో కొత్త‌గా 66,999 కరోనా పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 13 Aug 2020 10:06 AM IST
Coronavirus Updates in India: భారత్‌లో కొత్త‌గా 66,999 కరోనా పాజిటివ్ కేసులు
X
Representational Image

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 23 లక్షల 96 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 66,999 కేసులు నమోదు కాగా, 942 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 56,383 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 23,96,645 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,53,622 ఉండగా, 16,95,982 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 47,033 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 70.38 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.98 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 27.64 శాతంగా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story