గుజరాత్‌లో కొత్తగా 485 కేసులు.. ఒక్క అహ్మదాబాద్‌లోనే 290 కేసులు

S. Srikanth
Published on: 3 Jun 2020 10:12 PM IST
గుజరాత్‌లో కొత్తగా 485 కేసులు.. ఒక్క అహ్మదాబాద్‌లోనే 290 కేసులు
X
Representational Image

గుజరాత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న గుజరాత్‌లో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 485 పాజిటివ్ కేసులు, 30 మరణాలు సంభవించాయి. దీనితో గుజరాత్‌లో కరోనా కేసుల సంఖ్య 18,117కి చేరింది. ఒక్క అహ్మదాబాద్‌లోనే 290 కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు 1,122 మంది మృత్యువాతపడ్డారు.

భారత్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతుంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా 8,820కరోనా పాజిటివ్ కేసులు నమోద అయ్యాయి. గత 24 గంటలలో దేశంలో కరోనా కారణంగా 221 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల 2,07,191 నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 1,01,066గా ఉంది. 1,00,285 చికిత్స కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడి దేశంలో 5829 మొత్తం మృతి చెందారు.


S. Srikanth

S. Srikanth

Next Story