గుజరాత్‌లో కొత్తగా 415 కేసులు..

గుజరాత్‌లో కొత్తగా 415 కేసులు..
x
Representational Image
Highlights

గుజరాత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న గుజరాత్‌లో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది.

గుజరాత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న గుజరాత్‌లో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 415 పాజిటివ్ కేసులు, 29 మరణాలు సంభవించాయి. దీనితో గుజరాత్‌లో కరోనా కేసుల సంఖ్య 17,632కి చేరింది. ఒక్క అహ్మదాబాద్‌లోనే 279 కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు 1,092 మంది మృత్యువాతపడ్డారు.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 8,171 కేసులు నమోదు కాగా, 204 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. మొత్తంగా భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,98,706కు చేరుకోగా, మృతుల సంఖ్య 5,394కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 93,323 ఉండగా, 91,818 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories