ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా

ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా
x
Representational Image
Highlights

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. లాక్ డౌన్ సడలింపులతో ఢిల్లీలో కమ్యూనిటీ...

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. లాక్ డౌన్ సడలింపులతో ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దిశగా కరోనా వైరస్ వ్యాప్తి. ఢిల్లీలో 163 కి చేరిన కంటైన్మెంట్ జోన్ల సంఖ్య. గత 24 గంటల్లో 1,282 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తంమీద ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 28,936కు పెరిగాయి. ఇప్పటివరకు కరోనాతో 812 మంది చనిపోయారు. ఢిల్లీలో 17,125 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని 10,999 మంది డిశ్చార్జి అయ్యారు.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9971 కేసులు నమోదు కాగా, 287 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,46,628 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,20,406 ఉండగా, 1,19,292 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 6929 మంది వ్యాధితో మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. గడచిన 24 గంటలలో నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 1,42,069. దేశంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 46,66,386. భారత్ లో 48.02 గా కరోనా రికవరీ రేటు.


Show Full Article
Print Article
Next Story
More Stories