Coronavirus: భారత్ లో కరోనా వైరస్ పరీక్షా కేంద్రాలు 52.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే..
కరోనా వైరస్ ప్రపంచాన్ని తీవ్రంగా వణికిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ బారిన పది వేల సంఖ్యలో ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. ఈ వైరస్ సంక్రమించిన తరువాత 14 రోజులకు గానీ అది సంక్రమించిన విషయం తెలీదు. దీంతో దీనిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. మన దేశంలోనూ కరోనా వైరస్ సోకిన వాఋ రోజు రోజుకూ పెరుగుతున్నారు. ఈ నేపధ్యంలో కరోనా వైరస్ కోసం పరీక్షలు నిర్వహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకూ కరోనా టెస్టింగ్ కేంద్రాలను దేశవ్యాప్తంగా 52 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వివరాలు మీకోసం అందిస్తున్నాం!
ఆంధ్రప్రదేశ్:
శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి
ఆంధ్రా మెడికల్ కళాశాల, విశాఖపట్నం
జిఎంసి, అనంతపూర్
అస్సాం:
గువాహటి మెడికల్ కళాశాల, గువాహటి
రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, దిబ్రూగర్
అండమాన్ & నికోబార్ ద్వీపాలు:
రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, పోర్ట్ బ్లైర్, అండమాన్ & నికోబార్
బీహార్:
రాజేంద్ర మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పాట్నా
చండీఘర్:
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ & రీసెర్చ్, చండీఘర్
ఛత్తీస్ ఘడ్:
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్, రాయ్ పూర్
ఢిల్లీ-ఎన్.సి.ఆర్:
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఢిల్లీ
గుజరాత్:
బిజె, మెడికల్ కళాశాల, అహ్మదాబాద్
ఎం.పి.షాహ్ ప్రభుత్వ కళాశాల, జామ్ నగర్
హర్యానా:
పండిట్ బి.డి.శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రోహ్తక్, హర్యానా
బిపిఎస్ ప్రభుత్వ మెడికల్ కాషాలా, సోనిపట్
హిమాచల్ ప్రదేశ్:
ఇందిరాగాంధీ మెడికల్ కళాశాల, షిమ్లా, హిమాచల్ ప్రదేశ్
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, కాంగ్రా, తండ, హిమాచల్ ప్రదేశ్
జమ్మూ & కాశ్మీర్:
షేర్-ఈ-కాశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శ్రీనగర్
ప్రభుత్వ మెడికల్ కళాశాల, జమ్ము
జార్ఖండ్:
ఎంజిఎం మెడికల్ కళాశాల, జంషెడ్ పూర్
కర్ణాటక:
బెంగళూరు మెడికల్ కళాశాల & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, బెంగళూరు
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్డ్ యూనిట్ బెంగళూరు
మైసూర్ మెడికల్ కళాశాల & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, మైసూర్
హస్సన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శివమొగ్గ, కర్ణాటక
కేరళ:
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్డ్ యూనిట్, కేరళ
ప్రభుత్వ మెడికల్ కళాశాల, తిరువనంతపురం, కేరళ
ప్రభుత్వ మెడికల్ కళాశాల, కొజికోడ్, కేరళ
మధ్యప్రదేశ్:
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భోపాల్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్రైబల్ హెల్త్ (NIRTH), జబల్ పూర్
మేఘాలయ:
ఎన్ఈఐజిఆర్ఐ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్, షిల్లాంగ్, మేఘాలయ
మహారాష్ట్ర:
ఇందిరా గాంధీ ప్రభుత్వ మెడికల్ కళాశాల, నాగ్ పూర్
కస్తూర్బా హాస్పిటల్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, ముంబై
మణిపూర్:
జె ఎన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్, ఇంఫాల్-ఈస్ట్, మణిపూర్
ఒడిశా:
రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, భువనేశ్వర్
పుదుచ్చేరి:
జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్, పుదుచ్చేరి
పంజాబ్:
ప్రభుత్వ మెడికల్ కళాశాల, పాటియాలా, పంజాబ్
ప్రభుత్వ మెడికల్ కళాశాల, అమృత్ సర్
రాజస్థాన్:
సవాయి మన్ సింగ్, జైపూర్
డాక్టర్ ఎస్.ఎన్. మెడికల్ కళాశాల, జోధ్ పూర్
జవహర్ లాల్ మెడికల్ కళాశాల, ఝలవర్, రాజస్థాన్
ఎస్ పి మెడికల్ కళాశాల, బికనేర్, రాజస్థాన్
తమిళనాడు:
కింగ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ & రీసెర్చ్, చెన్నై
ప్రభుత్వ మెడికల్ కళాశాల, తేని
త్రిపుర:
ప్రభుత్వ మెడికల్ కళాశాల, అగర్తల
తెలంగాణ:
ప్రభుత్వ మెడికల్ కళాశాల, సికింద్రాబాద్
ఉత్తర్ ప్రదేశ్:
కింగ్స్ జార్జి మెడికల్ యూనివర్సిటీ, లక్నో
ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి
జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కళాశాల, అలీఘర్
ఉత్తరాఖండ్:
ప్రభుత్వ మెడికల్ కళాశాల, హల్ద్వాని
పశ్చిమ బెంగాల్:
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కలరా & ఎంటెర్నిక్ డిసీజెస్, కలకత్తా
ఐపిజిఎంఈఆర్, కలకత్తా
ఈ కేంద్రాల్లో కరోనా వైరస్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు.




