Coronavirus: భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

Coronavirus: భారత్‌లో కొత్తగా 35,871 కరోనా కేసులు, 172 మంది మృతి

Sandeep Eggoju
Updated on: 18 March 2021 11:15 AM IST
Coronavirus Spreading in India
X

ఫైల్ ఫోటో 

Coronavirus: భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 35వేల 871 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 172 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా కోటి 14 లక్షల 74వేల 605కి చేరాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. ఇప్పటి వరకు కరోనాతో లక్షా 59వేల 216 మంది కరోనాకు బలయ్యారు. కరోనా నుంచి కోటి,10లక్షల, 63వేల, 25 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 2లక్షల 52వేల 364 మంది కరోనా చికిత్స తీసుకుంటున్నారు.

తెలంగాణలో కొత్తగా 278 కరోనా కేసులు నమోదవ్వగా, ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలో 3లక్షల 2వేల47కి చేరాయి కరోనా పాజిటివ్‌ కేసులు. ఇప్పటివరకు కరోనాతో 1,662 మంది మృతి చెందగా రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి 2లక్షల 98వేల 120 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 2వేల 265 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story