Coronavirus: ఇండియాలో విజృంభిస్తోన్న కరోనా

Coronavirus: ఇవాళ అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు * గడిచిన 24 గంటల్లో 89,129 పాజిటివ్ కేసులు నమోదు

Sandeep Eggoju
Updated on: 3 April 2021 11:33 AM IST
Coronavirus Spreading in India
X

కరోన వైరస్ 

Coronavirus: ఇండియాలో కరోనా విజృంభిస్తోంది. వారం రోజులుగా క్రమంగా పెరుగుతున్న కేసులు.. ఇవాళ అత్యధికంగా ఏకంగా 90వేలకు చేరువలో నమోదు అయ్యాయి. గడిచిన 24గంటల్లో 89వేల 129 మంది కొవిడ్ బారిన పడ్డారు. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య కోటి 23 లక్షలు దాటినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడిచింది.

మరోవైపు కరోనా బారిన పడి మరో 714 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కొవిడ్ బారిన పడి మరణించిన వారి సంఖ్య లక్షా 64వేలకు చేరింది. నిన్న ఒక్కరోజే 44వేల మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 93.36శాతం, మరణాల రేటు 1.32శాతంగా నమోదు అవుతోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story