Coronavirus: భారత్‌లో వేగం పెంచిన కరోనా సెకండ్‌ వేవ్‌

Coronavirus Second Wave in India is Too Fast
x

కరోనా వైరస్ (ఫైల్ ఫోటో)

Highlights

Coronavirus: రోజుకు 60వేలకుపైగా పాజిటివ్‌ కేసులు * 8 రాష్ట్రాల్లో 84.5శాతం కరోనా కేసులు నమోదు

Coronavirus: కరోనా సెకండ్‌ వేవ్‌ హడలెత్తిస్తోంది. గతంలో కంటే వేగంగా పరుగులు పెడుతోన్న కేసులు ఆందోళన రేపుతున్నాయి. 20 రోజులుగా దేశంలో భారీగా కేసులు నమోదవుతుండగా.. రెండు రోజులుగా కేసులు 60 వేల మార్క్ దాటాయి. సోమవారం కేసుల సంఖ్య దాదాపు 70వేలకు చేరింది. గతేడాది అక్టోబర్ 15,16 తర్వాత ఇలా వరుసగా రెండు రోజులు 60 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

అయితే ప్రస్తుతం కరోనా ఎనిమిది రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచే రోజువారీ కేసుల్లో 85శాతం కేసులు నమోదవుతుండటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. 60శాతం కేసులు మహారాష్ట్ర నుంచి నమోదవగా మిగిలిన ఏడు రాష్ట్రాల్లో 25 శాతం పాజిటివ్ కేసులొస్తున్నాయి.

నిన్న దేశవ్యాప్తంగా 68 వేల 20 పాజిటివ్ కేసులు నమోదైతే అందులో మహారాష్ట్రలో 40 వేల 414 కేసులొచ్చాయి. ఇక కర్ణాటక నుంచి 4.53 శాతం.. పంజాబ్‌ నుంచి 4.21 శాతం కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో 3.34 శాతం, గుజరాత్‌లో 3.33 శాతం, కేరళలో 3.25, తమిళనాడులో 3.22, ఛత్తీస్‌ఘడ్‌లో 3.16 శాతం కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం దేశంలో 5లక్షల 21వేల 808 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులోనూ మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్ నుంచే అధికంగా ఉన్నాయి. ప్రస్తుత యాక్టివ్ కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాల్లోనే 80శాతం కేసులున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసుల్లోనూ కాదు మరణాల్లోనూ మహారాష్ట్ర టాప్‌లో నిలుస్తోంది. నిన్న 291 కొవిడ్ డెత్స్‌ నమోదైతే.. అందులో 81 శాతం 7 రాష్ట్రాల నుంచే ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 108 మంది చనిపోగా పంజాబ్‌లో 69 మంది మరణించారు.

ఇక సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి18 ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. ఇక్కడ ప్రతీ పది లక్షల మందిలో 8 వేల 7 వందల మంది కొవిడ్ బారిన పడుతున్నారు. మరో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కొవిడ్ కేసుల జాతీయ సగటు కంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories