కరోనా ఎలా ఉంటుందో తెలుసా? భారత శాస్త్రవేత్తలు బయట పెట్టిన ఫోటో!

కరోనా ఎలా ఉంటుందో తెలుసా? భారత శాస్త్రవేత్తలు బయట పెట్టిన ఫోటో!
x
corona virus (image curtsy ABI Tweet)
Highlights

కరోనా వచ్చింది.. కరోనా తో మరణించారు. కరోనాతో జాగ్రత్తగా ఉండాలి. కరోనా వ్యాధి వ్యాపిస్తుందని లాక్ డౌన్ ప్రకటించారు. ఇలా అన్నీ కనిపించని కరోనా గురించి...

కరోనా వచ్చింది.. కరోనా తో మరణించారు. కరోనాతో జాగ్రత్తగా ఉండాలి. కరోనా వ్యాధి వ్యాపిస్తుందని లాక్ డౌన్ ప్రకటించారు. ఇలా అన్నీ కనిపించని కరోనా గురించి వినిపించే వార్తలే. అసలు కరోనా ఎలా ఉంటుంది అనేది ఇప్పటివరకూ ఎవరికీ తెలీదు. అది ఓ ప్రాణాంతకమైన వైరస్ అంతే. కరోనా గురించి సింపుల్ గా ప్రజలకు తెలిసింది ఇదే.

కరోనా అంటే లాటిన్ భాసహ్లో కిరీటం అని అర్థం. మైక్రోస్కోపులో పరిశీలించినపుడు ఈ వైరస్ అలా కనబడుతుందని దానికి ఈ పేరు పెట్టారని చెప్పారు. అయితే, ఇంత వరకూ కరోనా వైరస్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. తొలిసారిగా భారత శాస్త్రవేత్తలు ఆ పని చేశారు. తాము పరిశీలనలో చూసిన కరోనా వైరస్ చిత్రాని వారు ఇటీవల ప్రచురించారు.

ఈ చిత్రాన్ని వారు జనవరి 30 న కేరళలో తొలి కరోనా పాజిటివ్ కేసు నుంచి తీసుకున్న నమూనాల నుంచి సేకరించారు. ఈ కరోనా వైరస్ చిత్రాని వారు ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో సార్స్-సీవోవీ-2 సంబంధించిన వివరాలతో పాటు ప్రచురించారు. మరి వారు ప్రచురించిన కరోనా వైరస్ చిత్రాన్ని ఏఎన్ఐ ట్వీట్ లో చూద్దాం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories