భారత్ లో మరోసారి పెరిగిన కరోనా కేసులు.. లెక్క చూస్తే..

భారత్ లో మరోసారి పెరిగిన కరోనా కేసులు.. లెక్క చూస్తే..
x
Highlights

భారత్ లో కరోనావైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 478 తాజా కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనావైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 478 తాజా కేసులు నమోదయ్యాయి. దాంతో భారతదేశంలో కేసుల సంఖ్య 2,567 కు పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించేసిన వివరాల ప్రకారం, భారతదేశంలో మొత్తం ధృవీకరించబడిన కేసుల సంఖ్య 2,567 కు చేరుకుంది, 163 నయం / విడుదల అయిన వారు ఉన్నారు. ఇక మరణాల సంఖ్య 62 కి పైగా పెరిగింది.

మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో అనేక కొత్త వైరస్ సంక్రమణ కేసులను నివేదించాయి, ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ సంఘటన కారణంగా ఈ సంఖ్యలు పెరిగాయని ప్రభుత్వ అధికారులు చెప్పారు. మార్చిలో దేశ రాజధానిలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో హాజరయ్యారు.

ఢిల్లీలో గత 24 గంటల్లో 93 కేసులు నమోదయ్యాయి, అందులో 77 మంది జమాత్ ఈవెంట్ కు హాజరయ్యారు, మహారాష్ట్రలో మొత్తం 67 కేసులు నమోదయ్యాయి, ఇందులో ముగ్గురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, తెలంగాణలో గత 24 గంటల్లో 75 కేసులు నమోదయ్యాయి.

వీరిలో అందరూ తబ్లిఘీకి హాజరయ్యారు. అదేవిధంగా, కేరళలో గత 24 గంటల్లో 9 కేసులు నమోదయ్యాయి వీటిలో ఏడు కేసులు తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 140 కేసులు నమోదైతే వారంతా ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్‌ అయినవారివే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories