వివిధ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య ఇదే..

వివిధ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య ఇదే..
x
Highlights

కరోనావైరస్ కు సంబంధించిన మరణాల సంఖ్య బుధవారం భారతదేశంలో 377 కు చేరుకోగా, మొత్తం ధృవీకరించబడిన కోవిడ్ -19 కేసుల సంఖ్య 11,000 మార్కును దాటింది.

కరోనావైరస్ కు సంబంధించిన మరణాల సంఖ్య బుధవారం భారతదేశంలో 377 కు చేరుకోగా, మొత్తం ధృవీకరించబడిన కోవిడ్ -19 కేసుల సంఖ్య 11,000 మార్కును దాటింది.గత 24 గంటల్లో, బుధవారం నాటికి భారతదేశంలో 38 మరణాలు నమోదయ్యాయి, అలాగే 1,076 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. వెయ్యికి పైగా తాజా కేసులతో, భారతదేశం కోవిడ్ -19 కేసుల సంఖ్య ఇప్పుడు 11,439 కు చేరుకుంది. వీటిలో 9,756 క్రియాశీల కేసులు ఉండగా, 1,306 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు లేదా నయం చేయబడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మొత్తం కేసుల్లో 76 మంది విదేశీ పౌరులు ఉన్నారు. బుధవారం ఉదయం అప్‌డేట్ చేసిన మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో అత్యధికంగా నమోదైన కేసులు మహారాష్ట్ర నుంచి 2,684, ఢిల్లీ 1,561, తమిళనాడు 1,204 , రాజస్థాన్‌లో 1,046, మధ్యప్రదేశ్‌లో 741, ఉత్తరప్రదేశ్‌లో 695, తెలంగాణలో 644 వరకు నమోదయ్యాయి. గుజరాత్‌లో 695 కేసులు, ఉత్తరప్రదేశ్ లో 660 , ఆంధ్రప్రదేశ్ 502, కేరళ 386 కేసులు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో 278, కర్ణాటకలో 277, హర్యానాలో 198, పశ్చిమ బెంగాల్‌లో 213 కు పెరిగింది. పంజాబ్‌లో ఇప్పటివరకు 184 ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. బీహార్‌లో 70 కేసులు, ఒడిశాలో 60 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

ఉత్తరాఖండ్‌లో ముప్పై ఏడు మందికి ఈ వైరస్ సోకింది, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గడ్ లలో 33 కేసులు, అస్సాంలో 32 కేసులు ఉన్నాయి. జార్ఖండ్‌లో 27, చండీగర్ లో 21 , లడఖ్‌ లో 17 కేసులు ఉండగా, 11 కేసులు అండమాన్, నికోబార్ దీవుల నుంచి నమోదయ్యాయి. గోవా లో 7 , పాండిచ్చేరిలో 7 , మణిపూర్ , త్రిపురలో 2 , ఇక అరుణాచల్ ప్రదేశ్ , దాద్రానగర్ హవేలీ, మేఘాలయ , మిజోరాం , నాగాలాండ్ లలో ఒక్కో కేసు నమోదైంది.


Show Full Article
Print Article
Next Story
More Stories