Corona Virus Updates భారతలో కొత్తగా 16 వేలకు పై కరోనా కేసులు

Corona Virus Updates: దేశంలో గడచిన 24గంటల్లో 16,752 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది

Kranthi
Updated on: 28 Feb 2021 12:04 PM IST
Newly over 16 thousand corona cases in India
X

ఫైల్ ఇమేజ్


Corona Virus Updates: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 16వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో 16,752 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,10,96,731కు పెరిగాయి. కొత్తగా 11,718 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,07,75,169 మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో రికవరీ రేటు 97.10 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో మరో 113 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,57,051కు పెరిగిందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 1,64,511 యాక్టివ్‌ కేసులున్నాయని, టీకా డ్రైవ్‌లో భాగంగా 1,43,01,266 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది. అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతుండడం గమనార్హం.

మరో వైపు తెలంగాణ లో శనివారం రాత్రి 8గంటల సమయం వరకు 40,985 కరోనా పరీక్షలు నిర్వహించగా 176 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా, కరోనా ఒకరు మృతి చెందారని ఆదివారం ఉదయం వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

Kranthi

Kranthi

Next Story