డిసెంబర్ నెలాఖరు నాటికి ఇండియాలో కరోనా టీకా

Arun Chilukuri
Published on: 4 Dec 2020 10:34 AM IST
డిసెంబర్ నెలాఖరు నాటికి ఇండియాలో కరోనా టీకా
X

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పరీక్షలు చివరి దశకు చేరుకోవడంతో డిసెంబరు నెలాఖర్లో లేక జనవరి ప్రారంభంలో టీకా అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్‌ డైరక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి పూర్తి అనుమతులు పొందిన తర్వాత అధికారులు ప్రజలకు దాన్ని అందించే ప్రక్రియను ప్రారంభిస్తారని చెప్పారు. వ్యాక్సిన్‌కు సంబంధించిన పనులన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తున్నాయని వివరించారు. వాటిని స్టోర్ చేసేందుకు తగిన ఉష్ణోగ్రతలు, స్థలం టీకా ఇచ్చే వారికి శిక్షణ, సిరంజిల లభ్యత వంటి వాటిపై కసరత్తు మొదలుపెట్టాయని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story