Corona: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోన్న సెకండ్ వేవ్

Corona Second Wave Trading the Country
x

Corona Second వేవ్:( ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Corona: వ్యాక్సిన్ వచ్చేసింది కరోనా పోతుంది అనుకునే లోపే మహమ్మారి మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తుంది.

Corona: వ్యాక్సిన్ వచ్చేసింది కరోనా పోతుంది అనుకునే లోపే మహమ్మారి మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఒకటీరెండూ కాదు ప్రతిరోజూ వేలాది కేసులు పెరగడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటు ప్రధాని మోడీ కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పరిణామాలు చూస్తుంటే దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో టెన్షన్...

మరోవైపు.. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో టెన్షన్ మొదలైంది. లాక్‌డౌన్ తర్వాత ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం, ఇప్పటికే పలు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలు విధించడంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. దేశంలో సెకండ్ వేవ్ మొదలైంది అన్న వార్తలు ప్రజలను కలవర పెడుతున్నాయి.

కొత్త స్ట్రెయిన్ వేరియంట్లు మాత్రం కల్లోలం...

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీరు మారిపోయింది. గతేడాది వచ్చిన వైరస్ తగ్గిపోగా.. తాజాగా విజృంభిస్తున్న కొత్త స్ట్రెయిన్ వేరియంట్లు మాత్రం కల్లోలం సృష్టిస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్, యూరప్‌లో ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇటు భారత్‌నూ కొత్త స్ట్రెయిన్ భయపెడుతోంది. మూడు రకాల కొత్త వేరియంట్స్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కనుగోంది. బ్రిటన్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాకు చెందిన వేరియంట్స్‌ను గుర్తించినట్లు తెలిపింది. అయితే.. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కేసులు పెరుగుతుండడంతో భయాందోళనలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీకా పనితీరు గురించి తెలియాలంటే ఇంకాస్త సమయం పడుతుంది అంటున్నారు వైద్యులు.

సరిహద్దుల్లో ఉన్న జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ...

ఇటు.. తెలంగాణలోనూ గత కొన్నిరోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, కేరళ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రజలు తగిన జాత్రత్తలు పాటించక పోతే పెను ప్రమాదం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories