Covid 19: కరోనా కేసులు.. భయాందోళనలో తెలుగు రాష్ట్రాల ప్రజలు

Corona Second Wave Tension in India
x

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం

Highlights

Covid 19: భారత్‌లో కరోనా మరోసారి కోరలు చాస్తోంది.

Covid 19: భారత్‌లో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. మెల్లమెల్లగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ఉగ్రరూపం దాల్చుతోన్న వైరస్‌.. దేశ రాజధానిలో పంజా విసురుతోంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణ కోసం వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మహారాష్ట్రతోపాటు ఛత్తీస్‌గడ్, కేరళ, గుజరాత్‌ల్లో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా భారత్‌లో నాలుగో వంతు జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా కేసులు పెరుగుతుండడంతో అటు అధికారులు, ఇటు ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. గతంలో వందల సంఖ్యలో కేసులుంటే.. ఇప్పుడు వేయి కేసులు రికార్డువుతున్నాయి. చెప్పాలంటే గత సంవత్సర పరిస్థితి ఇప్పుడు మళ్లీ కనిపిస్తోంది.

దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసుల్లో కేవలం మహారాష్ట్రలోనే 65శాతానికిపైగా రికార్డు అవుతున్నాయి. అంతేకాదు ఆరాష్ట్రంలో ఇతర కరోనా మ్యూటేషన్‌ కేసులు గణనీయంగా కనిపిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో మే నెలల్లో కరోనా తీవ్రత వల్ల గరిష్ఠంగా కేసులు నమోదవుతాయని స్పష్టంగా అర్థమౌతోంది. కాగా.. ప్రస్తుతం కరోనాతో యుద్ధం చేయడానికి వ్యాక్సిన్‌లున్నాయి. ఒకవేళ లేకపోతే లాక్‌డౌన్‌లతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత ఛిన్నాభిన్నమయ్యేది.

ఇక ప్రస్తుతం దేశంలో చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే రాబోయే 45 రోజుల్లో వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా పూర్తిచేస్తే.. కరోనా సెకండ్‌ వేవ్‌.. మే నెలలో లేదా మధ్యలో అయిన నియంత్రణలోకి వస్తుంది. అలా జరగకపోతే దేశంలో కొవిడ్‌ వ్యాప్తి నుంచి తప్పించుకోలేము. అంతేకాదు మరోసారి లాక్‌డౌన్‌లు, నిరంతర ఆంక్షలు ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తాయి. ఇక కరోనా వ్యాప్తిని సులువుగా తీసుకుంటే ఎండ్‌గేమ్‌ ముందేవుందని చెప్పొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories