Maharashtra: రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

Maharashtra: మహారాష్ట్రలో రోజుకు 30వేలకుపైగా కరోనా కేసులు

Sandeep Eggoju
Updated on: 31 March 2021 1:50 PM IST
Corona Positive Cases Increasing day by day in Maharashtra
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Maharashtra: భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిత్యం వేలల్లో కేసులు పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కొన్నిరోజుల నుంచి 30వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం కేసుల సంఖ్య కొంతమేర తగ్గగా మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఇక మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27లక్షల 73వేల 436కి పెరగగా మరణించిన వారి సంఖ్య 54వేల 422కి చేరింది.

ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల 40వేల 542 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అటు దేశంలో కరోనా కేసులు, మరణాలు పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం కరోనా నిబంధనలు పాటించకపోతే.. కఠినమైన లాక్‌డౌన్‌ అమలు చేయకతప్పదని హెచ్చరించారు. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌, నైట్‌ కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story