Corona Cases in India: దేశంలో కొత్తగా 4,14,188 కేసులు

Corona Cases in India: 4,14,188 New Corona Cases Reported in India on 7th May 2021
x

Corona Cases in India: దేశంలో కొత్తగా 4,14,188 కేసులు

Highlights

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 2,14,91,598కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 4,14,188 కేసులు నమోదు కాగా, 3,915 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,31,507 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. వీరిలో ఇప్పటి వరకు 2,34,083 మంది మరణించగా.. 1,76,12,351 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 16,49,73,058 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories