Corona Cases in India: దేశంలో కొత్తగా 4,03,738 కరోనా కేసులు

Corona Cases in India: 4,03,738 New Corona Cases Reported in India on 9th May 2021
x

కరోనా(ఫైల్ ఇమేజ్ )

Highlights

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది.

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 2,22,96,414కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 4,03,738 కేసులు నమోదు కాగా, 4,092 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,86,444 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. వీరిలో ఇప్పటి వరకు 2,42,362 మంది మరణించగా.. 1,83,17,404 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 16,94,39,663 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories