Corona Cases in India: గడిచిన 24గంటల్లో 39,742 కొత్త కేసులు

Corona Cases in India: కరోనాతో మరో 535 మంది మృతి

Sandeep Eggoju
Published on: 25 July 2021 11:23 AM IST
Corona Cases in India: 39,742 New Corona Cases Reported in India on 25th July 2021
X

Representational Image

Corona Cases in India: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 17 లక్షల 18వేలకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 39,742 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మరోవైపు.. కోవిడ్‌తో మరో 535 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 4 లక్షల 20 వేలకు చేరింది.

కొత్త కేసులతో పోల్చితే రికవరీల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 93 వేల 972 మంది కరోనా జయించారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4 లక్షల 8 వేలకు చేరింది. ఆ రేటు 1.30 శాతానికి తగ్గింది. మరోవైపు.. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story