Corona Cases In India: కొత్తగా 39,361 మందికి సోకిన కరోనా

Corona Cases In India: గడిచిన 24గంటల్లో 416 మంది మృతి * 4,20,967కి చేరిన మృతుల సంఖ్య

Sandeep Eggoju
Published on: 26 July 2021 1:20 PM IST
Corona Cases in India: 39,361 New Corona Cases Reported in India on 26th July 2021
X

Representational Image

Corona Cases In India: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 11 లక్షలకు పైగా శాంపిల్స్ సేకరించగా.. అందులో 39వేల 361 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మరోవైపు.. మరణాల సంఖ్య దాదాపు నాలుగు వందలకు దిగొచ్చింది. గడిచిన 24గంటల్లో 416 మంది కరోనా తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 4 లక్షల 20 వేల 967కి చేరింది. మార్చి 30న 354 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత మృతుల సంఖ్యలో ఈ స్థాయి తగ్గుదల కనిపించడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

మరోవైపు గడిచిన 24గంటల్లో కరోనా నుంచి 35 వేల 968 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 3.14 కోట్లకు చేరగా 3.05 కోట్ల మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల రేటు 1.31 శాతానికి చేరగా రికవరీ రేటు 97.35 శాతంగా ఉంది. అయితే.. ఇటీవల కాలంలో రికవరీల కంటే కేసులే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కేరళలో కొత్త కేసులు భారీగా వెలుగు చూశాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story