Corona Cases in India: దేశంలో కొత్తగా 3,66,161 కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

Arun Chilukuri
Published on: 10 May 2021 10:24 AM IST
Corona Cases in India: 3,66,161 New Corona Cases Reported in India on 10th May 2021
X

కరోనా(ఫైల్ ఇమేజ్ )

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 2,26,62,575కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 3,66,161 కేసులు నమోదు కాగా, 3,754 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,53,818 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. వీరిలో ఇప్పటి వరకు 2,46,116 మంది మరణించగా.. 1,86,71,222 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 17,01,76,603 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story