Corona Cases in India: 3.57లక్షల కొత్త కేసులు..3,449 మరణాలు

Corona Cases in India: భార‌త్‌లో ప్రతిరోజు మూడు ల‌క్షల‌కు పైగా క‌రోనా కేసులు నమోద‌వుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 4 May 2021 10:08 AM IST
Corona Cases in India: 3,57,229 New Corona Cases Reported in India on 4th May 2021
X

క‌రోనా(ఫైల్ ఇమేజ్ )

Corona Cases in India: భార‌త్‌లో ప్రతిరోజు మూడు ల‌క్షల‌కు పైగా క‌రోనా కేసులు నమోద‌వుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. నిన్న కొత్తగా 3లక్షల, 57వేల, 229 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నిన్న 3లక్షల, 20వేల, 289 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2కోట్ల, 02లక్షల, 82వేల,833 కు చేరింది.

గడిచిన 24 గంట‌ల సమయంలో 3వేల,449 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2లక్షల, 22వేల 408కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1కోటి, 66లక్షల, 13వేల, 292 మంది కోలుకున్నారు. 34లక్షల, 47వేల, 133 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15కోట్ల ,89లక్షల, 32వేల,921 మందికి వ్యాక్సిన్లు వేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story