Corona Cases in India: 3.23లక్షల కొత్త కేసులు..2,771 మరణాలు

Corona Cases in India: భార‌త్‌లో ప్రతిరోజు మూడు ల‌క్షల‌కు పైగా క‌రోనా కేసులు నమోద‌వుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

Arun Chilukuri
Updated on: 27 April 2021 11:33 AM IST
Corona Cases in India: 3,23,144 New Corona Cases Reported in India on 27 April 2021
X

క‌రోనా(ఫైల్ ఇమేజ్ )

Corona Cases in India: భార‌త్‌లో ప్రతిరోజు మూడు ల‌క్షల‌కు పైగా క‌రోనా కేసులు నమోద‌వుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. నిన్న కొత్తగా 3లక్షల, 23వేల, 144 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నిన్న 2లక్షల, 51వేల, 827 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1కోటి, 76లక్షల, 36వేల,307 కు చేరింది.

గడిచిన 24 గంట‌ల సమయంలో 2వేల,771 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1కోటి, 97లక్షల, 894కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1కోటి, 45లక్షల, 56వేల, 209 మంది కోలుకున్నారు. 28లక్షల, 82వేల, 204 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 14కోట్ల ,52లక్షల, 71వేల,186 మందికి వ్యాక్సిన్లు వేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story