Corona Cases in India: దేశంలో కొత్తగా2,63,533 కరోనా కేసులు నమోదు

Corona Cases in India: భారత్ లో వరుసగా మూడవ రోజు 3 లక్షలకు దిగువ కేసులు నమోదు అయినా.. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

Kranthi
Published on: 19 May 2021 10:26 AM IST
Corona cases in India 2,67,334, new corona cases reported in India on 19th May
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Corona Cases in India: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే వుంది. వరుసగా మూడవ రోజు 3 లక్షలకు దిగువ కేసులు నమోదు అవుతున్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 2,52,28,996కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 2,7,334 కేసులు నమోదు కాగా, 4329 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,19,86,363 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. వీరిలో ఇప్పటి వరకు 2,93,248 మంది మరణించగా.. 2,15,96,512 మంది కోలుకున్నారు. దేశంలో 85.60 శాతం కరోనా రోగుల రికవరీ రేటు. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 13.29 శాతం. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.10 శాతం అని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

మరో వైపు భారత్ లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని, రికవరీ రేటు పుంజుకుందని కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 81.7 శాతం నుంచి 85.6 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4.22 లక్షల మంది కోలుకున్నారని చెప్పారు. గత 3 వారాలుగా 199 జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు వెల్లడించారు.

దేశంలో ఇప్పటివరకు 1.8 శాతం మంది కరోనా బారినపడ్డారని, దేశ జనాభాలో 2 శాతం కంటే తక్కువేనని వివరించారు. ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని, 10 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష మధ్య యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో 50 వేల కంటే తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో పాజిటివిటీ రేటు 14.1 శాతంగా ఉందని, మరణాల రేటు 1.10 శాతంగా ఉందని లవ్ అగర్వాల్ వివరించారు.

Kranthi

Kranthi

Next Story