Corona Cases in India: దేశంలో విస్తరిస్తున్న కరోనా.. 24 గంటల్లో 2లక్షల 64 వేల కేసులు

Corona Cases in India: దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. 24గంటల్లో 2లక్షల 64వేల 202 కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Published on: 14 Jan 2022 11:09 AM IST
Corona expanding in the country
X

దేశంలో విస్తరిస్తున్న కరోనా

Corona Cases in India: దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. 24గంటల్లో 2లక్షల 64వేల 202 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 12 లక్షలు దాటాయి. పాజిటివిటీ రేటు 14.78కి చేరింది. ఒక్కరోజులో 6.7 శాతం కేసులు పెరిగినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. 24 గంటల్లో లక్షా 9వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5వేల 753కి చేరాయి.

దేశంలో కరోనా వైరస్ మళ్లీ ప్రతాపం చూపిస్తుండడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి రోజున ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్‌లోని గంగానదిలో భక్తుల పుణ్యస్నానాలపై నిషేధం విధించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story