Corona Cases in India: దేశంలో కొత్తగా 2,63,533 కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

Arun Chilukuri
Published on: 18 May 2021 9:28 AM IST
Corona Cases in India: 2,63,533 New Corona Cases Reported in India on 18th May 2021
X

కరోనా(ఫైల్ ఇమేజ్ )

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 2,52,28,996కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 2,63,533 కేసులు నమోదు కాగా, 4329 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 4,22,436 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. వీరిలో ఇప్పటి వరకు 2,78,719 మంది మరణించగా.. 2,15,96,512 మంది కోలుకున్నారు. దేశంలో 84.81 శాతం కరోనా రోగుల రికవరీ రేటు. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 14.09 శాతం. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.10 శాతం అని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story