భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona Cases: రోజువారీ కేసులు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న జనం.

Sriveni Erugu
Published on: 15 Feb 2022 10:53 AM IST
Corona Cases Greatly Reduced in India
X

భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona Cases: భారత్‌లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. థర్డ్‌వేవ్ వైరస్ వణికించగా.. రోజువారీ కేసులు తగ్గడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 27 వేల 409 కేసులు నమోదయ్యాయి. తాజాగా 82,817 మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో 347 మంది వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం దేశంలో 4 లక్షల, 23వేల, 127 యాక్టివ్‌ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.23శాతంగా ఉందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4 కోట్ల,26 లక్షల, 92వేల, 943కు చేరింది. ఇందులో 4 కోట్ల, 17లక్షల, 60వేల, 458 మంది కోలుకున్నారు. వైరస్‌ కారణంగా 5 లక్షల, 9వేల, 358 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు దేశంలో టీకా డ్రైవ్‌ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 173.42 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story