భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases: గడిచిన 24 గంటల్లో 6,050 కేసులు నమోదు

Dhatripriya
Published on: 7 April 2023 12:13 PM IST
Corona Cases Are Increasing In India
X

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases In India: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో 6వేల 050 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13 శాతం పెరిగాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉండగా, వారం వారీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉందని కేంద్రమంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర అలర్ట్ అయ్యింది. కోవిడ్ పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తిపై కేంద్రం క్రమం తప్పకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది.

Dhatripriya

Dhatripriya

Next Story