దేశ వ్యాప్తంగా 3 వేలకు చేరిన కరోనా యాక్టివ్ కేసులు

India Corona Cases: కేరళలో అత్యధికంగా కరోనా కేసుల నమోదు

Jyothi
Published on: 22 Dec 2023 11:22 AM IST
Corona Active Cases have Reached 3000 Across the Country
X

దేశ వ్యాప్తంగా 3 వేలకు చేరిన కరోనా యాక్టివ్ కేసులు

India Corona Cases: భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. రోజువారీగా వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో కొత్తగా 2 వేల 669 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేలకు పైగా చేరింది. దేశ వ్యాప్తంగా అత్యధికంగా కొవిడ్ కేసులు 10 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణ, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో రోజువారీగా అత్యధికసంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయని హెల్త మినిస్ట్రీ తెలిపింది.

Jyothi

Jyothi

Next Story