Congress stole 6 BSP MLAs: రాజస్థాన్ సీఎం తీరుపై మాయావతి ఫైర్.. వారు అలా చేయకపోతే పార్టీ సభ్యత్వం రద్దు..

Congress stole 6 BSP MLAs: రాజస్థాన్ సీఎం తీరుపై మాయావతి ఫైర్.. వారు అలా చేయకపోతే పార్టీ సభ్యత్వం రద్దు..
x
Highlights

Congress stole 6 BSP MLAs: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీరుపై బీఎస్పీ ఛీఫ్ మాయావతి ఫైర్ అయ్యారు. రాజ‌స్థాన్ రాజ‌కీయ సంక్షోభంపై మాయావ‌తి ఇవాళ...


Congress stole 6 BSP MLAs: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీరుపై బీఎస్పీ ఛీఫ్ మాయావతి ఫైర్ అయ్యారు. రాజ‌స్థాన్ రాజ‌కీయ సంక్షోభంపై మాయావ‌తి ఇవాళ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ శాసనసభ్యులను గెహ్లాట్ అక్రమంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత త‌మ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఎటువంటి ష‌ర‌తులు లేకుండానే కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లు ఆమె చెప్పారు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు, బీఎస్‌పీని న‌ష్ట‌ప‌రిచేవిధంగా అప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా త‌మ ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్‌లో విలీనం చేశార‌ని ఆమె అన్నారు. గ‌తంలో సీఎంగా చేసిన స‌య‌మంలోనూ గెహ్లాట్ ఇలాంటి అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు మాయా ఆరోపించారు. గెహ్లాట్ చ‌ర్య‌ల‌ను వ్య‌తిరేకిస్తూ గ‌తంలోనూ కోర్టుకు వెళ్లాల‌నుకున్నామ‌ని, కానీ స‌రైన సంద‌ర్భంలోనే గెహ్లాట్‌కు, కాంగ్రెస్ పార్టీకి గుణ‌పాఠం చెప్పాల‌ని ఎదురుచూశామ‌ని మాయావ‌తి తెలిపారు. అందుకే ఇప్ప‌డు కోర్టుకు వెళ్లాల‌ని డిసైడ్ అయిన‌ట్లు ఆమె చెప్పారు.

ఈ విష‌యాన్ని ఇప్పుడు వ‌దిలేది లేద‌ని, అవ‌స‌ర‌మైతే తాము సుప్రీంకోర్టుకు కూడా వెళ్ల‌నున్న‌ట్లు బీఎస్‌పీ చీఫ్ తెలిపారు. బీఎస్పీ గుర్తుపై గెలిచిన రాజస్థాన్ బీఎస్పీ ఎమ్మెల్యేలకు మాయావతి మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గెహ్లోత్ ప్రభుత్వం బల పరీక్షకు దిగితే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని మరోసారి ఆదేశాలిచ్చారు. ఒకవేళ ఈ సూచనను ధిక్కరించి కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఆ పార్టీ సభ్యత్వాలు రద్దవుతాయని హెచ్చరించారు. యూపీలో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా మారిపోయిందని ఆమె ఆరోపించారు. నేరస్థులు యూపీని పాలిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఒకవేళ పరిస్థితులు మెరుగుపరచాలని సీఎం యోగి భావిస్తే, బీఎస్పీ నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆమె సూచించారు. నాలుగుసార్లు త‌మ పార్టీ యూపీలో పాలించింద‌ని, ఆ స‌మ‌యంలో రాష్ట్రంలో శాంతి, భ‌ద్ర‌త‌లు స్థిరంగా ఉన్న‌ట్లు ఆమె చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories