Mayawati on Rajasthan politics: రాజస్థాన్ లో రాష్ట్రపతి పాలనలో విధించాలి : బీఎస్పీ అధినేత్రి మాయవతి

Mayawati on Rajasthan politics: రాజస్థాన్ లో రాష్ట్రపతి పాలనలో విధించాలి : బీఎస్పీ అధినేత్రి మాయవతి
x
mayawathi
Highlights

Mayawati on Rajasthan politics: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ వాది పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయవతి సంచలన వ్యాఖ్యలు చేశారు

Mayawati on Rajasthan politics: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ వాది పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయవతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ రాజకీయ తిరుగుబాటులో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. రాజస్థాన్‌లో రాజకీయ అస్థిరత కారణంగా అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని మాయావతి డిమాండ్ చేశారు. అక్కడ నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన, రాజకీయ తిరుగుబాట్లను గవర్నర్ దృష్టికి తీసుకురావాలని ఆమె అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని.. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించేలా సిఫారసు చేయాలని అన్నారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇంతకుముందు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు బిఎస్పి చీఫ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. బిఎస్‌పిని అశోక్ గెహ్లాట్ వరుసగా రెండుసార్లు మోసం చేశారని.. ఇలా చేసి తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని అన్నారు. ఇదంతా చేసి ఇప్పుడు ఫోన్ టేపుల ద్వారా మరొక చట్టవిరుద్ధమైన , రాజ్యాంగ విరుద్ధమైన చర్యకు పూనుకున్నారని ఆమె దుయ్యబట్టారు. కోటాలో 105 మంది చిన్నారుల వరుస మరణాలను మాయావతి ప్రశ్నించారు. 100 మంది తల్లులకు గర్భకోశాన్ని మిగిల్చిన గెహ్లాట్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని ఆమె కాంగ్రెస్ ను కూడా డిమాండ్ చేశారు.

కాగా రాజస్థాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 200 సీట్లలో 100 స్థానాలను గెలుచుకుంది. మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌దళ్ నుంచి ఒక సభ్యుడు గెలిచారు. అయితే రాష్ట్రంలో అధికారం దక్కిన్చుకున్నా.. ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో బిఎస్పి నుంచి గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరారు. ఈ కారణం చేత మాయావతి.. కాంగ్రెస్, గెహ్లాట్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories