ఆసక్తిగా మారిన పవన్- మాయవతిల సమావేశం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయవతిని ఆయన కాసేపట్లో కలవనున్నారు. కాంగ్రెస్‌తో బీఎస్పీ విభేదిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ భేటి కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అయితే ఇరు పార్టీల మధ్య గతంలోనే చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ ఏడాదిలో మార్చిలో బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు పవన్‌తో భేటి అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Next Story




