Congress: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ సంచలన వ్యా‍‌ఖ్యలు

Congress: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ సంచలన వ్యా‍‌ఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 10 Jun 2021 6:01 PM IST
Congress Needs To Undergo Major Surgery: Veerappa Moily
X

వీరప్ప మొయిలీ(ఫైల్ ఇమేజ్ )

Congress: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ సంచలన వ్యా‍‌ఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోలుకోవాలంటే భారీ శస్త్ర చికిత్స అవసరమన్నారు. కేవలం వారసత్వం, గత చరిత్రపై ఆధారపడితే లాభం లేదని వీరప్ప మొయిలీ అన్నారు. ప్రస్తుతం పార్టీలోని నేతల సమర్ధతను సరైన రీతిలో మదింపు చేయాలని అధిష్టానానికి సూచించారు. అర్హత లేనివాళ్లను అందలమెక్కించొద్దని గట్టిగా చెప్పారు.

ఎవరికైనా కీలక బాధ్యతలు అప్పగించేటప్పుడు నమ్మకమైన నిబద్ధతగల నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానానికి వీరప్ప మొయిలీ సూచించారు. కాంగ్రెస్‌ తన వ్యూహాలను మార్చుకోవాలని, అలాగే తీసుకోవాల్సిన నిర్ణయాలపై నాన్చుడి ధోరణి వదిలిపెట్టాలని, లేదంటే కాంగ్రెస్‌ కోలుకోవడం కష్టమన్నారు వీరప్ప మొయిలీ.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story