Punjab Elections: కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా విడుదల.. సోనూసూద్‌ సోదరి పోటీ ఇక్కడి నుంచే!

Punjab Elections: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్‌ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

Arun Chilukuri
Published on: 15 Jan 2022 5:50 PM IST
Congress Finalises First List of Candidates for Punjab Elections
X

Punjab Elections: కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా విడుదల.. సోనూసూద్‌ సోదరి పోటీ ఇక్కడి నుంచే!

Punjab Elections: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్‌ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తన అధికార పీఠాన్ని నిలుపుకోవడమే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. మొత్తం 86మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్‌ చన్నీ ఈసారి కూడా చామ్‌కౌర్‌ సాహెబ్‌ నుంచి బరిలో దిగుతుండగా పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ అమృత్‌సర్‌ తూర్పు నుంచి పోటీ చేయనున్నారు.

అలాగే, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌కు మోగ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఉపముఖ్యమంత్రి సుఖ్‌జిందర్‌ సింగ్‌ రాంధ్వా డేరాబాబా నానక్‌ స్థానం నుంచి, రవాణాశాఖ మంత్రి రాజా అమరిందర్‌ గిద్దర్బహా నుంచి బరిలో దిగుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం రూపొందించిన అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌ విడుదల చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story