Delhi Floods: యమునా నది ఉగ్రరూపంతో నీటమునిగిన కాలనీలు.. ఎర్రకోట, సెక్రటేరియట్, అసెంబ్లీ చుట్టూ నీరు
Delhi Floods: 45 ఏళ్ల ఆల్‌టైమ్ హైకి చేరిన యమునా నది నీటిమట్టం
Delhi Floods: యమునా నది ఉగ్రరూపంతో నీటమునిగిన కాలనీలు.. ఎర్రకోట, సెక్రటేరియట్, అసెంబ్లీ చుట్టూ నీరు
Delhi Floods: వానలు తగ్గినా ఢిల్లీని వరదలు వదలడం లేదు. యమునా నది ఉగ్రరూపంతో ఢిల్లీ మొత్తం వరద మయం అయింది. కాలనీలన్నీ నీటమునిగాయి. భారీ వరదలకు ఎర్రకోట, సెక్రటేరియట్, అసెంబ్లీ చుట్టూ నీరు చేరింది. ఐటీఓ, సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాలకు వరద చేరుకుంది. హత్నికుండ్ బ్యారేజీ నుండి నీటి విడుదల కొనసాగుతుండటంతో ఢిల్లీ నగరం జలదిగ్బంధమైంది. ప్రస్తుతం 208.66 మీటర్ల దగ్గర యమునా నది నీటిమట్టం కొనసాగుతోంది. వరదలతో రవాణా వ్యవస్థకు కూడా అంతరాయం ఏర్పడింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతోంది. రాజ్‌ఘాట్ నుంచి సెక్రటేరియట్ వరకు రోడ్డంతా వరద నీటితో మునిగిపోయింది. మరోవైపు వరదలతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు కూడా మూసేయాల్సి వచ్చింది. దీంతో నగరమంతా తాగునీటికి ఇబ్బందులు తలెత్తాయి.




