Delhi: కుప్పకూలిన స్టేజి.. ఓ మహిళ మృతి, 17 మందికి గాయాలు

Delhi: ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

Jyothi
Published on: 28 Jan 2024 10:54 AM IST
Collapsed stage of Spiritual Program in Delhi
X

Delhi: కుప్పకూలిన స్టేజి.. ఓ మహిళ మృతి, 17 మందికి గాయాలు

Delhi: ఢిల్లీలోని కల్కాజీ మందిర్‌లో ప్రమాదం ఊహించని ప్రమాదం జరిగింది. ఓ ఈవెంట్ సంస్థ శనివారం అర్ధరాత్రి నిర్వహించిన ఆధ్యాత్మిక వేడుకల్లో ఒక్కసారిగా స్టేజి కుప్పకూలింది. చెక్క మరియు ఇనుప వస్తువులతో ఓ స్టేజి ఏర్పాటు చేశారు. స్టేజిపై కీర్తనలు ఆలపిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని హాస్పిటళ్లకు తరలించారు.

ఇక ఊహించని ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పరిమితికి మించి ప్రజలు అక్కడికి చేరుకుని స్టేజిపైకి చేరుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

Jyothi

Jyothi

Next Story